నేను ఎక్కడికి పోలేదు నన్ను అరెస్ట్ చేయలేదు : రవి ప్రకాష్

SMTV Desk 2019-05-10 13:58:34  TV9, Ravi Prakash ,

టీవీ9 సీఈవో పదవి నుంచి తనను తప్పించారన్న ప్రచారాన్ని రవిప్రకాశ్ ఖండించారు. టీవీ9 స్టూడియోలో స్పెషల్ షోలో ప్రత్యక్షమైన ఆయన తన గురించి, టీవీ 9లో ఏదో జరుగుతోందంటూ ఉదయం నుంచి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. తన గురించి వస్తున్న వార్తల వల్ల చాలా మంది గందరగోళం ఏర్పడిందని.. దీంతో ఎంతో మంది తనకు ఫోన్లు చేస్తున్నారని మరికొంత మంది టీవీ 9కు ఫోన్లు చేస్తున్నారని అలాంటి వారందరికి ఒక్కటే చెబుతున్నానని తాను ఎక్కడికీ పారిపోలేదని, ఎవరూ అరెస్ట్ చేయడం లేదని స్పష్టంచేశారు. ఒక కేసు కోర్టులో ఉందని మే 16 విచారణ జరగుతుందని దానికి హాజరు కావాల్సి ఉండగా దాన్ని పట్టుకుని పారిపోయినట్ట్టు ప్రచారం చేశారని అన్నారు. తోటి ఛానెళ్లు కాస్త బాధ్యతయుతంగా వ్యవహరించి వార్తలు ప్రసారం చేసి ఉంటే బాగుండేదని సామాజిక సేవ కోసం టీవీ9 జర్నలిస్టులు పనిచేస్తున్నారని అన్నారు. అంతే కాక తాను ఇప్పుడు టీవీ9 సీఈవోగానే మాట్లాడుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు