నేడు రెండో దశ పరిషత్ పోలింగ్

SMTV Desk 2019-05-10 13:57:12  Parishath elections,

తెలంగాణలో ఎన్నికల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. నేడు రెండో దశ పరిషత్ పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 179 జెడ్పీటీసీ, 1,850 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే రెండో దశలో మొత్తం 1,850 ఎంపీటీసీ స్థానాల్లో 6,146 మంది, 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశలో ఒక జెడ్పీటీసీ స్థానం, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

అయితే పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. అయితే ఈ సారి పోలింగ్‌లో ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలుకు సిరా చుక్క అంటించబోతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల కమీషన్ అన్నీ ఏర్పాట్లను సక్రమంగా చేసింది. అల్లర్లకు తావు లేకుండా అదనపు భద్రతతో ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నామని ఎన్నికల కమీషన్ చెప్పుకొచ్చింది.