దుమ్ములేపుతున్న రాజశేఖర్ కల్కి సినిమా కమర్షియల్ ట్రైలర్..

SMTV Desk 2019-05-10 13:54:24  kalki, Rajasekhar,

గ‌రుడ‌వేగ సినిమాతో తానింకా ఫాంలోనే ఉన్నాన‌ని నిరూపించుకున్న రాజశేఖర్ ఇప్పుడు మ‌రో ప‌వ‌ర్ ఫుల్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ ట్రైల‌ర్ ఈరోజు విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది. మొదటి టీజర్ మామూలుగానే కట్ చేసిన డైరెక్టర్ ఈ టీజర్ లో మాత్రం కామెడీని ఫోకస్ చేశారు. టీజర్ చివరిలో ఉన్న ఏం సేస్తిరి సేస్తిరి అనే డైలాగ్ రాజ‌శేఖ‌ర్ ఇమిటేష‌న్ సీన్ ట్రైల‌ర్‌లో హైలైట్ అయ్యాయి. ఆ లాంటి ప్రయోగాత్మక సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క‌ల్కి సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ వేగంగా జ‌రుగుతున్నాయి.అదాశ‌ర్మ‌, నందిత శ్వేత ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే క‌ల్కి సినిమా విడుద‌ల కానుంది. ఈ టీజర్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అదిరిపోయే సెటైర్లు వేసాడు రాజ‌శేఖ‌ర్. ఈయ‌న త‌న కొత్త సినిమా క‌ల్కితో గ‌బ్బ‌ర్ సింగ్‌ ని టార్గెట్ చేసాడు. ఆ సినిమా చూసిన వాళ్లెవ్వ‌రూ అంత ఈజీగా అంత్యాక్ష‌రి ఎపిసోడ్ మిస్ అవ్వ‌రు.. అక్క‌డ రాజ‌శేఖ‌ర్ ఇమిటేష‌న్ కామెడీని మ‌రిచిపోరు.. ఇప్పుడు ఇదే కామెడీని త‌న సినిమా కోసం వాడేసుకున్నాడు రాజ‌శేఖ‌ర్.