ప్రొజెక్టైల్స్‌ను పరీక్షించిన ఉత్తరకొరియా

SMTV Desk 2019-05-10 13:36:31  projectiles, north korea, nuclear weapons

ప్యాంగ్‌యాంగ్‌: ఉత్తరకొరియా నేడు కొన్ని ప్రొజెక్టైల్స్‌ను పరీక్షించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా వెల్లడించింది. ఇటీవల పలు స్వల్ప శ్రేణి క్షిపణులను ఉత్తరకొరియా పరీక్షించిన విషయం తెలిసిందే. రాజధాని ప్యాంగ్‌యాంగ్‌ సమీపంలో ఉన్న సినోరై ప్రాంతం నుంచి ప్రొజెక్టైల్స్‌ను ప్రయోగించారు. అణు నిరాయుధీకరణ అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన రెండు దఫా చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఉత్తరకొరియా క్షిపణి పరీక్షల వేగాన్ని పెంచింది. ఇటీవల వ్యూహాత్మక ఆయుధాలను కూడా కిమ్‌ టీమ్‌ పరీక్షించింది. ఆ క్షిపణి సుమారు 420 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తుంది.