గూగుల్‌పై వస్తున్న ఆరోపణలను ఖండించిన సిఈఓ

SMTV Desk 2019-05-10 13:35:46  google, google ceo, sundar pichchai, top rated

న్యూయార్క్‌: గూగుల్‌ తన వినియోగదారుల ప్రైవసీని, డేటాను అవసరాలు అనుగుణంగా వాడుకుంటోందని వస్తున్న ఆరోపణలను గూగుల్‌ సిఈఓ సుందర్‌ పిచా§్‌ు ఖండించారు. గోప్యత అనేది విలాస వస్తువు కాదని అది కేవలం ఖరీదైన వస్తువులు, సేవలు పొందగలిగిన సామర్ధ్యం ఉన్న ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌కు రాసిన వ్యాసంలో గూగుల్‌ పాలసీలను ఆయన బలంగా సమర్ధించారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ప్రైవసీ అనేది సమానంగా ఉంటుందని, ఈ విషయంలో గూగుల్‌ ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు.