అందుకే వైజాగ్ లో 'కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్‌'

SMTV Desk 2019-05-10 13:35:00  Vizag, Counter intelligence Schme

ఏపీలోని విజయవాడ, తిరుపతి వంటి నగరాలతో పాటు విశాఖపట్నం కూడా ముఖ్యకేంద్రంగా మారిందని ఏపీ డీజీపీ ఠాకూర్‌ తెలిపారు. ఈరోజు ఆయన వైజాగ్ లో కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్‌ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ... విశాఖకు వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని.. అందులో భాగంగా క్రైమ్ రేట్ కూడా పెరుగుతోందని తెలిపారు.

అదేవిధంగా విశాఖలో కూడా సైబర్‌ నేరాలు ఎక్కువయ్యాయని అన్నారు. అందుకే విశాఖపై ప్రత్యేక దృష్టిసారించామని వివరించారు. నగరంలో ప్రతి కార్నర్‌లో సీసీటీవీలు ఏర్పాటు చేస్తున్నానమని వెల్లడించారు. కాగా శ్రీలంక పేలుళ్ల విషయంలో కూడా సీసీటీవీలే కీలకంగా మారాయని ఠాకూర్ వివరించారు.