హుద్ హుద్ తుఫాన్‌ కనిపించలేదా?

SMTV Desk 2019-05-10 13:34:14  vijay sai reddy, yamini

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ మహిళా నేత యామిని సాధినేని తీవ్రంగా విరుచుకు పడ్డారు. గాలికి సచివాలయంలో టెంట్ పడితే నానా యాగీ చేస్తున్న విజయసాయిరెడ్డికి హుద్ హుద్ తుఫాన్‌ కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం అమలు చూసి కేంద్రం ఏపీకి అవార్డులు ఇచ్చిందని ఆమె అన్నారు.

అదేవిధంగా నిధులు రాకుండా వైసీపీ ఆపాలని చూసిందని కూడా ఆమె తీవ్రమైన ఆరోపణాస్త్రాలు సంధించారు. టీడీపీపై విషం చిమ్మడమే విజయసాయిరెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని... ఆమె విమర్శించారు. విజయసాయిరెడ్డి పేరు వీసా రెడ్డిగా మార్చుకున్నారని ఆమె తెలిపారు. మే 23 తర్వాత విజయసాయిరెడ్డి విదేశాలకు పారిపోవడం ఖాయమని యామిని సాధినేని తేల్చి చెప్పారు.