ఒడిశాకు రూ.10 కోట్లు విరాళం ఇవనున్న కర్ణాటక ప్రభుత్వం

SMTV Desk 2019-05-10 13:32:22  odisha, Karnataka,

బెంగళూరు : ఫణి తుఫాను కారణంగా ఒడిశా అతలాకుతలమైంది. ఫణి బాధితులకు అండగా కర్ణాటక ప్రభుత్వం నిలిచింది. ఫణి తుఫాను బాధితుల సహాయార్థం రూ.10 కోట్లు రిలీఫ్‌ ఫండ్‌కు ఇస్తున్నట్లు కర్ణాటక సిఎం కుమారస్వామి ప్రకటించారు. ఫణి కారణంగా మరణించిన వారికి, నిరాశ్రయులైన బాధితుల కోసం రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్లు కుమారస్వామి వెల్లడించారు. ఫణి కారణంగా ఒడిశాలో సుమారు 50 మంది చనిపోయారు. ఫణి తుఫాను కారణంగా నష్టపోయిన ఒడిశా ప్రజలను ఆదుకునేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి.