మీరు ఆపకపోతే....పాక్ కు నదీ నీళ్లు వెళ్లకుండా ఆపేస్తాం..: పాకిస్థాన్ కు నితిన్ గడ్కరీ వార్నింగ్

SMTV Desk 2019-05-10 13:12:27  indus river, nithin gadkari, transport minister

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పొరుగున ఉన్న పాకిస్థాన్ దేశానికి సంచలన హెచ్చరిక చేశారు. పాకిస్థాన్ దేశం ఉగ్రవాదులకు మద్ధతు కొనసాగిస్తే..ఆ దేశానికి వెళ్లే ఇండస్ నదీ నీటిని నిలిపివేస్తామని నితిన్ గడ్కరీ హెచ్చరించారు. ‘‘భారతదేశం నుంచి పాకిస్థాన్ దేశానికి ఇండస్ నదీ ద్వార నీరు వెళుతోంది...రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు, శాంతియుత పరిస్థితులు కొనసాగినంత కాలం నదీ నీటిని ఆ దేశానికి విడుదల చేస్తాం...కాని పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహాయ సహకారాలు కొనసాగితే మాత్రం ఇండస్ నదీ నీటిని ఆ దేశానికి విడుదల చేసేదిలేదు’’ అని నితిన్ గడ్కరీ హెచ్చరించారు.

ఇండస్ నదిలో ప్రవహిస్తున్న నీరు హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వస్తుందని మంత్రి చెప్పారు. 1960వ సంవత్సరంలో మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తో కలిసి నదీజలాల పంపకం విషయంలో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం రవి, బీయాస్, సట్లైజ్ నదీ జలాల వినియోగంపై భారతదేశానికి పూర్తి హక్కులున్నాయి. ఇండస్, చేనాబ్, జేలం నదుల నీటిని పాకిస్థాన్ వినియోగించుకోవచ్చు.ఉగ్రవాదం విషయంలో పాక్ వైఖరి మారకుంటే ఆ దేశానిక ిచుక్క నీరు కూడా వదిలిపెట్టమని గడ్కరీ హెచ్చరించారు.