తిరుమలలో హిట్ మాన్

SMTV Desk 2019-05-10 13:02:02  Rohit Sharma, Tirumala,

తిరుమల : తిరుమల శ్రీవారిని టీం ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రోహిత్ శర్మ, ఆయన కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందచేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని రోహిత్ శర్మ తెలిపారు.