నేటికి ఏడాది పూర్తి చేసుకున్న 'మహానటి'

SMTV Desk 2019-05-10 13:00:23  keerthy suresh, savithri, mahanati

తెలుగు తెర చందమామగా అభిమానులతో నీరాజనాలు అందుకున్న సావిత్రి, ఆ తరువాత తన జీవితాన్ని విషాదాంతం చేసుకున్నారు. అలాంటి సావిత్రి జీవితాన్ని మహానటి పేరుతో .. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. క్రితం ఏడాది ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ రోజుతో ఈ సినిమా ఏడాది కాలాన్ని పూర్తిచేసుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకుని కీర్తి సురేశ్ ట్వీట్ చేసింది. మహానటి సినిమాలో నటించడం నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టం. సావిత్రి వంటి గొప్ప నటి పాత్రను, దర్శకుడు నాగ్ అశ్విన్ గారు నన్ను నమ్మి నాకు ఇచ్చారు. ఈ పాత్రను నేను చేయగలను అనే ఆత్మస్థైర్యాన్ని నాకు కలిగించారు. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లందరి సహాయ సహకారాలతోనే నేను ఈ పాత్రకి న్యాయం చేయగలిగాను. నాగ్ అశ్విన్ సహా ఈ విజయంలో భాగమైన వాళ్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని ట్విట్టర్లో రాసుకొచ్చారు.