వారు ఇక ఇంటికే పరిమితం....!

SMTV Desk 2019-05-10 12:39:40  srilanka, burkha banned

శ్రీలంక: శ్రీలంకలో వరుస బాంబు దాడుల అనంతరం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ బుర్ఖాలు నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ముస్లిం సామాజిక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తమ మతాచారంలో భాగంగా బురఖా ధరించే బయటకు రావాల్సి ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలు రాలేకపోతున్నారు. ఇంటికే పరిమితమవుతున్నారు.శ్రీలంకలో ఈస్టర్ ఆదివారం రోజున జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో 250 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భద్రతను కట్టుదిట్టం చేసే పనిలో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది ఆ దేశ ప్రభుత్వం. బురఖాలు ధరించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అక్కడి ముస్లిం సామాజిక మహిళలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాలంటే బురఖా తీసి వెళ్లలేని పరిస్థితి దాపురించింది. ఏప్రిల్ 29 నుంచి అమల్లోకి వచ్చిన నిషేధంతో ముస్లిం మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.