కాలింగ్ బెల్ కొట్టినందుకు పాము కాటు

SMTV Desk 2019-05-10 12:38:48  snake bites on calling bell person

అమెరిక: కాలింగ్ బెల్ కొట్టినందుకు ఓ వ్యక్తిని పాము కాటేసింది. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం...అమెరికాకు చెందిన ఓ వ్యక్తి వేరొకరి ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లగానే కాలింగ్ బెల్ నొక్కాడు. అంతే.. ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వెలుపలికి వచ్చిన పాము కాలింగ్ బెల్ కొట్టిన వ్యక్తి కంటికి పై భాగంలో కాటేసింది.అంతే ఆ వ్యక్తి లబోదిబోమంటూ అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకా ఆ ఇంట్లోని వ్యక్తుల వద్ద తనను ఆస్పత్రికి తీసుకుపోవాల్సిందిగా కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సీసీటీవీ కెమెరాలో ఈ తతంగమంతా రికార్డు అయ్యింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాము కాటుకు గురైన వ్యక్తి ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు.కాలింగ్ బెల్ కొట్టిన వ్యక్తిని కరిచిన పామును కొట్టి చంపేశారని.. ఆ పాము విషపూరితమైనది కాదని వార్తలు వస్తున్నాయి. ఇంకేముంది.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మీరూ ఓ లుక్కేయండి.