సిద్ధూపై చెప్పుతో దాడి....మహిళా అరెస్ట్

SMTV Desk 2019-05-10 12:37:27  navyajoth singh siddhu

చండీగఢ్: పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఓ మహిళా చెప్పు విసిరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలో నిర్వహిస్తున్న ఓ బహిరంగ సభలో సిద్ధూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు చెప్పు విసిరానంటూ ఆమె అంటున్న మాటలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. మోడీని తీవ్రంగా విమర్శించే వారిలో సిద్ధూ ముందు వరుసలో ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఏ చిన్న చాన్స్ దొరికిగా మోడీపై నిప్పులు చెరగడానికి పంజాబ్ మంత్రి సిద్ధూ సిద్దంగా ఉంటాడు.