తీర్పు కోసం 201 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ..?

SMTV Desk 2017-08-25 12:37:00  chandighad, gurmithsingh baba, court verdict, 201 trains cancel

చండీగఢ్‌, ఆగస్ట్ 25 : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మీత్‌సింగ్‌ మహిళా సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించి రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పోలీసులు, పారా మిలటరీ బలగాలను మోహరించారు. ఈ తీర్పు నేపధ్యంలో దాదాపు 200లకు పైగా వాహనాలతో గుర్మీత్ సింగ్ కోర్టుకు చేరుకోనున్నారు. ఇప్పటికే 30 వేలమంది గుర్మీత్‌ మద్దతు దారులు పంచకులలోని ఆయన ఆశ్రమానికి చేరుకోవడం ఉత్కంఠ రేపుతోంది. పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు వస్తుండడంతో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశముందని నిఘావర్గాలు భావిస్తున్నాయి. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా పంజాబ్, హరియాణా రాష్ట్రాల మీదుగా నడిచే 201 రైళ్లను భద్రతా కారణాల రీత్యా రైల్వే రద్దు చేయడం విశేషం.