సత్తా చాటిన స్మిత్

SMTV Desk 2019-05-09 19:06:13  steve smith

ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో బుధవారం జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌ అర్ధ సెంచరీ (77 బంతుల్లో 89 నాటౌట్‌ 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో సత్తా చాటాడు. ప్రపంచకప్‌కు ముందు అర్ధ సెంచరీ చేసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా ఎలెవెన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. స్మిత్‌కు తోడు ఉస్మాన్ ఖావాజా (56; 4 ఫోర్లు), మ్యాక్స్‌వెల్‌ (52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు కూడా అర్ధ సెంచరీలు చేశారు. లక్ష్య ఛేదనలో విల్‌ యంగ్‌ (130; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ.. వర్కర్‌ (56; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ టామ్ లాథమ్‌ (69; 5 ఫోర్లు, సిక్స్‌)లు అర్ధసెంచరీలు చేయడంతో న్యూజిలాండ్‌ ఎలెవెన్‌ 47.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసి విజయం సాదించింది. స్టార్క్ రెండు వికెట్లు తీసాడు.న్యూజిలాండ్‌ ఎలెవెన్‌లో స్టార్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్‌, మార్టిన్ గుప్తిల్, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంట్నర్ లు ఐపీఎల్ సీజన్-12లో ఆడుతుండడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వీరు లేకున్నా.. కెప్టెన్ లాథమ్‌ జట్టును ముందుండి నడిపించాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్‌ మెరిసినా.. ఐపీఎల్-12లో పరుగుల వరద పారించిన వార్నర్ నిరాశపరిచాడు.