టీ20లో ఆడేందుకు సిద్దమయిన పూజార

SMTV Desk 2019-05-09 19:00:12  cheteshwar pujara, t20

రాజ్‌కోట్: ఐపీఎల్ ఫ్రాంచైజీల నిరాదరణకు గురైన టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ముద్రపడ్డ చతేశ్వర్ పుజార సొంత రాష్ట్రం సౌరాష్ట్ర టీ20 ప్రీమియర్ లీగ్(ఎస్‌పీఎల్)లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇది వరకు డీవై పాటిల్ టీ20 కప్ లాంటి టోర్నీలు ఆడిన పుజార..ఎస్‌పీఎల్‌లో అందుబాటులో ఉండబోతున్నట్లు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈనెల 14న మొదలయ్యే ఎస్‌పీఎల్‌లో మొత్తం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో ఏ జట్టు తరపున పుజార ఆడుతాడనేది గురువారం తేలిపోతుందని బోర్డు పేర్కొంది. ఎస్‌పీఎల్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌తో బిజీగా ఉన్నా..టీ20 లీగ్‌లో ఆడేందుకు పుజార అంగీకరించడం మరింత సంతోషాన్నిచ్చింది అని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.