రెండవ విడత స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం

SMTV Desk 2019-05-09 13:46:59  Elections,

తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి మొదటి విడత స్థానిక ఎన్నికలు సజావుగా సాగడంతో ఇప్పుడు అందరి చూపు రెండవ విడత స్థానిక ఎన్నికలపై పడింది. కాగా రెండవ విడత స్థానిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సమకూర్చామని, అవసరమైన భద్రతాబలగాలను ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారులు చెప్పారు. కాగా ఎన్నికల సమయంలో అవాంతరాలు లేకుండా ఎన్నికలు జరుపుతామని చెప్పారు. కాగా అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా బలగాలతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. అవసరమైన సూచనలను చేశారు.

ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని 600 మంది సిబ్బందితోపాటు బయటి నుంచి మరో 100 మంది కలిపి మొత్తం 700 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఆరుగురు సిఐలు,12 మంది ఎస్ఐలు, 60 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు,180 మంది సివిల్ కానిస్టేబుల్స్, 80 మంది సాయుధ కానిస్టేబుల్స్,100 మంది ఫారెస్ట్ ఆఫీసర్స్, 100 మంది హోంగార్డ్స్, 3 స్పెషల్ పార్టీలు, 3 బాంబ్ డిస్పోసల్ టీంలు, 31 మొబైల్ పార్టీలు, 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఆరుగురు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ , ఎస్పీ రిజర్వ్ పార్టీలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.