వైజాగ్ చేరిన చెన్నై జట్టు .. ధోని పిక్ వైరల్...

SMTV Desk 2019-05-09 13:08:59  dhoni,

చెన్నైలో జరిగిన క్వాలిఫయర్-1లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైన చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్ 2 ఆడేందుకు వైజాగ్ చేరుకున్నారు. భార్యాబిడ్డలతో సహా విశాఖపట్టణం చేరుకున్న సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వైజాగ్ ప్రజలు, క్రికెట్ అభిమానులు ఘనస్వాగతం పలికారు.

రేపు.. మే 10వ తేదీ శుక్రవారం జరిగే మ్యాచ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎస్కే యాజమాన్యం ఎల్లో బెటాలియన్ విశాఖపట్నం చేరుకుందంటూ ధోనీ, సాక్షి ధోనీ, జివాలు వైజాగ్ ఎయిర్ పోర్ట్ బయటికి నడుచుకుంటూ వస్తున్న ఫోటోని ట్వీట్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.