ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

SMTV Desk 2019-05-09 12:56:03  ipl 2019, Eliminator match srh vs dc

వైజాగ్: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌ వైజాగ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫయర్2కు అర్హత సాధించగా ఓడిపోయిన జట్టు ఎలిమినేట్ అవుతుంది. ఈ సీజన్లో ఢిల్లీ 14 మ్యాచులు ఆడి అందులో 9 విజయాలు సాధించి దర్జాగా ప్లేఆఫ్‌కు చేరుకుంది. మరోవైపు మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో 14 మ్యాచుల్లో ఆరు విజయాలు మాత్రమే సాధించి అనూహ్యంగా ప్లేఆఫ్ బెర్త్‌ను దక్కించుకుంది.

Sunrisers Hyderabad: Wriddhiman Saha (W),Martin Guptill,Manish Pandey,Kane Williamson (C),Vijay Shankar,Deepak Hooda,Mohammad Nabi,Rashid Khan,Bhuvneshwar Kumar,Khaleel Ahmed,Basil Thampi.

Delhi Capitals: Prithvi Shaw,Shikhar Dhawan,Shreyas Iyer (C),Rishabh Pant (W),Colin Munro,Sherfane Rutherford,Axar Patel,Keemo Paul,Amit Mishra,Ishant Sharma,Trent Boult.