బాలాకోట్‌ దాడిలో 170మంది ఉగ్రవాదులు హతం: ఇటలీ జర్నలిస్ట్

SMTV Desk 2019-05-09 12:52:17  balakot attack, indian airforce, pakistan terrorists, jaish e mohammed senior commands

ఇస్లామాబాద్: ఫిబ్రవరి 26న భారత వాయుసేన బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరంలో ఉన్న జైషే మహ్మద్ సంస్థపై జరిపిన దాడుల్లో 170 మంది వరకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చనిపోయారని ఇటలీ జర్నలిస్ట్ ఫ్రాన్సెస్కా మెరినో తెలిపారు. చనిపోయన 170 మందిలో ఉగ్రవాద శిక్షణ ఇచ్చేవారు, బాంబులు తయారు చేసేవారు ఉన్నారని పేర్కొన్నారు. బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరంలో జైషే మహ్మద్ సంస్థ శిక్షణ ఇస్తోందని తెలిపారు. దాడి జరిగిన పాకిస్థాన్ ఎలాంటి అటాక్ చేయలేదని కబుర్లు చెప్పిందని విమర్శించారు. ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదని సమర్థించుకునే పనిచేసిందని మండిపడ్డారు.