50 విమానాల రాకపోకల్లో అంతరాయం

SMTV Desk 2019-05-09 12:49:43  iaf flight, mumbai, chatrapati shivaji airport, 50 flights

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్ -32 ముంబై విమానాశ్రయం రన్ వేపై ఇష్టారాజ్యంగా దూసుకురావడంతో 50 విమానాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. మంగళవారం రాత్రి బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషను నుంచి ఏఎన్ -32 విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయం రన్ వే పై దూసుకు వచ్చింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోయినా ముంబయి విమానాశ్రయంలో 50 విమానాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ముంబై నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు 28 నిమిషాల పాటు ఆలస్యంగా బయలు దేరాయి.