పుట్టిన తరువాత పాపా నుండి వచ్చిన మొదటి మాట...షాక్ లో తల్లి

SMTV Desk 2019-05-09 12:48:33  11 months baby say alexa

యూకే: 11 నెలల పసికందు తన తల్లికి షాకిచ్చింది. ఎవరైనా పుట్టిన తరువాత నోటి నుండి మొదటగా వచ్చే మాట అమ్మ . కాని ఈ పాప అమ్మ కాకుండా అలెక్సా అని అంది. అంతే తన తల్లి ఒక్కసారిగా షాక్ అయ్యింది. అలెక్సా అంటే .....అలెక్సా అని పిలిచి మనం ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పే అమెజాన్ వాయిస్ యాక్టివేటెడ్ గ్యాడ్జెట్. పూర్తి వివరాల ప్రకారం...యూకేకు చెందిన 11 నెలల అన్నాబెల్లే అనే పాప ఒకటి కాదు రెండు కాదు పదులసార్లు అలెక్సా అంటూ పిలిచింది. పాప నోట అలెక్సా అనే మాట రాగానే తల్లిదండ్రులు షాకయ్యారట. కారణం… ఆ పాపకు మూడేళ్ల వయసున్న ఓ అన్నయ్య ఉన్నాడు. ఆ పిల్లాడు రైమ్స్ నేర్చుకోవడం కోసం అమెజాన్ అలెక్సాను కొనుక్కొచ్చారు. ఆ పిల్లాడు పదే పదే అలెక్సా అని పిలవడాన్ని నిశితంగా గమనించిన పాపాయి.. ఆ పదాన్ని గుర్తుపెట్టుకొంది. అలా ఆ చిన్నారి నోటి నుంచి వచ్చిన తొలి మాట అమ్మ బదులు అలెక్సా అయ్యింది.