మిథాలికి టోర్నీలో తొలి విజయం

SMTV Desk 2019-05-09 12:44:43  womens ipl 2019, Trailblazers vs Velocity

జైపూర్: ఐపీఎల్ మహిళల క్రికెట్ టోర్నీలో భాగంగా నేడు జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ట్రైల్‌బ్లాజర్స్‌ జట్టుపై వెలాసిటీ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీలో ఆ జట్టు శుభారంభం చేసింది. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన స్మ్రితి బ్యాటింగ్ కు వెళ్ళగా 10 పరుగులకే ఔటైంది. తరువాత హర్లీన్‌ డియోల్‌ (43; 40 బంతుల్లో 5ఫోర్లు), సుజీ బేట్స్‌ (26; 22 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఏక్తా బిష్ఠ్‌, అమెలియా కెర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో 112/6 పరుగులు మాత్రమె చేయగలిగారు. ఇక చేధనలో వెలాసిటీ జట్టు సులభంగా తమ లక్ష్యాన్ని సాధించి విజయాన్ని సొంతం చేసుకున్నారు.