లైంగిక వేధింపులపై నోరు తెరిచిన రక్ష

SMTV Desk 2019-05-09 12:38:28  sexual harassment, casting couch, director miss behave

లైంగిక వేధింపులపై మరో హీరోయిన్ నోరు తెరిచింది. కాలేజీ టైంలో, సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఎదుర్కొన్న వేధింపులని బయటపెట్టింది. రక్ష హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. అత్త, తల్లి పాత్రలతో మెప్పిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రక్ష ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై స్పందించారు.

‘నాకు పెళ్లై కూతురుంది. స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకోనని ముందే చెబితే.. దర్శకుడు ఓ కే అన్నారు. సెట్ కి వెళ్లిన తరువాత తేడాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనతో డబల్ మీనింగ్ మాటలు..వెకిలి చేష్టలు చేయడం మొదలు పెట్టాడు. దాంతో విపరీతమైన కోపం వచ్చి దగ్గరకు పిలిచి చెంప ఛెల్లుమనిపించానని.. తర్వాత పోలీసలకు ఫిర్యాదు ఇవ్వాలని చూస్తే..హీరో వద్దు మేడమ్ పరువు పోతుందని చెప్పడంతో ఆగిపోయా’నని చెప్పుకొచ్చింది రక్ష.