శ్రీలంకకు ఉగ్రవాదుల ముప్పు ఇంకా ఉంది!

SMTV Desk 2019-05-09 12:31:52  ranil wickramasinghe, srilanka

కొలంబో: శ్రీలంకకు ఇంకా ఉగ్రవాదుల ముప్పు ఉందని లంక ప్రధాన మంత్రి రాణెల్ విక్రమాసింఘే తెలిపారు. ఇప్పటికే దేశ సైన్యం, పోలీసులు సమయస్పూర్తిగా, వీరోచితంగా ఉగ్రవాదులను మట్టుపెట్టారని అయినా ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పారు. దేశ భద్రతపై మంగళవారం పార్లమెంటులో జరిగిన చర్చకు ప్రధాని విక్రమాసింఘే మాట్లాడుతూ... గత నెలలో ఈస్టర్ సండే సందర్భంగా మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్ళలో ఉగ్రవాదులు బాంబులు పేల్చిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులు తామే చేశామంటూ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ప్రమాదం పూర్తిగా సమిసిపోలేదని, ప్రపంచంలో మనం ఇప్పుడు ఉగ్రవాదుల బాధితులం.. అని ఆయన అన్నారు. పోలీసులు, సైన్యం కృషి ఫలితంగా దేశంలో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.