విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' విడుదల తేదీ ఖరారు

SMTV Desk 2019-05-08 17:42:42  vijay deverakonda, dear comrade, geetha govindam

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా డియర్ కామ్రేడ్ రూపొందుతోంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ జోడీగా రష్మిక మందన నటిస్తోంది. మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ .. క్రికెటర్ గా రష్మిక నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. జూన్ 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. మైత్రీ మూవీ మేకర్స్ - బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా తెరకెక్కిన గీత గోవిందం సంచలన విజయం సాధించడంతో, సహజంగానే డియర్ కామ్రేడ్ పై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.