కృత్రిమ కాలుతో బాలుడి డ్యాన్...వీడియో వైరల్

SMTV Desk 2019-05-08 17:40:41  Afghanistani Boy Who Lost Leg in Landmine Dancing Video

ఆఫ్గనిస్తాన్: ఆఫ్గనిస్తాన్ లో ఎనిమిది నెలల వయస్సున్న బాలుడు రెండు గ్రూపుల మధ్య ఎదురు కాల్పుల్లో బుల్లెట్ తగిలి కాలును పోగొట్టుకున్నాడు. గత నాలుగేళ్లుగా కృత్రిమ కాలును అమర్చేందుకు ప్రయాత్నాలు చేస్తున్నారు డాక్టర్లు, చివరగా కృత్రిమ కాలును అమర్చారు. ఇంకేముంది బాలుడి సంతోషానికి అవదులు లేవు, కాలుపెట్టిన ఆసుపత్రిలోనే గంతులు వేశాడు. ఆ వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. పూర్తి వివరాల ప్రకారం ....ఈ బుడతడి పేరు అహ్మద్. ఎనిమిది నెలల వయస్సున్న బాలుడు రెండు గ్రూపుల మధ్య ఎదురు కాల్పుల్లో బుల్లెట్ తగిలి ఒక కాలు పొగొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్ కు ఇటీవల కృత్రిమ కాలు అమర్చారు వైద్యులు. మొదట కృత్రిమ కాలిలో నడవడానికే ఇబ్బంది పడ్డ అతడు ఇప్పుడు ఏంచక్కా తన కాలిపై తాను నడవగలుగుతున్నాడు. తాజాగా అదే కాలితో నృత్యం చేస్తుండగా ఒకరు వీడియో తీశారు. మే 8న వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ డే 2019 సందర్భంగా రెడ్ క్రాస్ కమిటీ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.