కెనడాకు వెళ్ళిన ఆసియా బీబీ

SMTV Desk 2019-05-08 17:36:29  canada, asia bibi, asia bibi going canada

ఇస్లామాబాద్‌: మహ్మద్‌ ప్రవక్తను దూషించి సంచలనం సృష్టించిన క్రైస్తవ మహిళ ఆసియా బీబీ పాకిస్తాన్ ను ఒదిలి కెనడాకు వెళ్ళినట్లు ఆమె త‌ర‌పున లాయ‌ర్ తెలిపాడు. ఈమెకు మహ్మద్‌ ప్రవక్తను దూషించినందుకు 2009లో పాకిస్థాన్‌లో ఉరి శిక్ష విధించింది. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఆమెకు మరణ శిక్ష నుండి విముక్తి పొందింది. ఈ కేసులో ఆసియా 8 ఏళ్ల జైలు శిక్ష‌ను అనుభ‌వించింది. ఆసియా బీబీకి చెందిన ఇద్ద‌రు పిల్ల‌ల‌కు కూడా కెన‌డా ఆశ్ర‌యం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే పాక్ ప్ర‌భుత్వం మాత్రం దీనిపై ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.