ఫైనల్‌కు వెళ్తాం!

SMTV Desk 2019-05-08 17:28:46  ipl 2019, csk vs mi, ms dhoni

చెన్నై: మంగళవారం రాత్రి చేపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంభై ఘన విజయాన్ని సాధించి ఫైనల్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం చెన్నై జట్టు కాప్టెన్ ధోని మాట్లాడుతూ.... ఖచ్చితంగా ఫైనల్‌కు చేరుకుంటామని, జట్టులో మంచి బ్యాట్స్‌మెన్‌ ఉన్నారని, పలు మ్యాచ్‌ల్లో తాము బాగా బ్యాటింగ్‌ చేశామని, అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌ ఉన్నా మంచి షాట్లు ఆడలేకపోయామని అన్నారు. తర్వాతి మ్యాచ్‌లో తాము మెరుగైన ప్రదర్శన చేస్తామని భావిస్తున్నానని ధోని ధీమా వ్యక్తం చేశారు.