బాలకృష్ణ సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసిన అందాల భామ

SMTV Desk 2019-05-08 17:26:24  haripriya, jai simha, bala krishna, legend

బాలకృష్ణ తదుపరి సినిమా బోయపాటితో ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు కెఎస్ రవికుమార్ కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో జైసింహా వచ్చింది. సి.కల్యాణ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయనే రంగంలోకి దిగి కెఎస్ రవికుమార్ ప్రాజెక్టును బాలకృష్ణ అంగీకరించేలా చేశాడని చెప్పుకుంటున్నారు.

త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించే దిశగా పనులను కానిచ్చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఒక కథానాయికగా హరిప్రియ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జై సింహా లో బాలకృష్ణ సరసన ఆమె ఆడిపాడింది. ఆ సినిమా ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేదు. మరి ఈ సినిమా అయినా ఆమెకి ఇక్కడ మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందేమో చూడాలి.