10.4 శాతం డివైస్‌లల్లో ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్

SMTV Desk 2019-05-08 17:23:50  android, android 9.o

గూగుల్ సంస్థ తాజాగా ఆండ్రాయిడ్ ఫోన్లలో రన్ అవుతున్న ఆండ్రాయిడ్ ఓఎస్‌లను బట్టి ఆండ్రాయిడ్ డిస్ట్రిబ్యూషన్ నంబర్లను రిలీజ్ చేసింది. ఈ డేటాలో మే 2019 నెల వరకు పొందుపరిచి ఉంది. కాగా దీని ఈ డేటా ప్రకారం ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ డివైస్‌లలో 10.4 శాతం డివైస్‌లలో రన్ అవుతున్నది. అలాగే ఆండ్రాయిడ్ ఓరియో 28.3 శాతం డివైస్‌లలో, నూగట్ 19.2 శాతం డివైస్‌లలో, మార్ష్‌మాలో 16.9 శాతం వాటిలో, లాలిపాప్ 14.5 శాతం డివైస్‌లలో, కిట్‌క్యాట్ ఓఎస్ 6.9 శాతం డివైస్‌లలో రన్ అవుతున్నది. మే 7వ తేదీకి 7 రోజుల ముందు వరకు తాము సేకరించిన సమాచారాన్ని బట్టి ఈ వివరాలను వెల్లడించామని గూగుల్ తెలిపింది. కాగా ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్ ఆండ్రాయిడ్ 10.0 క్యూ మరో రెండు నెలల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది.