జాబ్రా ఎవాల్వ్ 65ఇ సెకండ్ జనరేషన్ వైర్‌లెస్ హెడ్‌సెట్‌ రిలీజ్

SMTV Desk 2019-05-08 16:09:31  Jabra Elite 65e Wireless Bluetooth Headphone

తాజాగా భారత మార్కెట్లోకి జాబ్రా కంపెనీ ఎవాల్వ్ 65ఇ సెకండ్ జనరేషన్ వైర్‌లెస్ హెడ్‌సెట్‌ను రిలీజ్ చేసింది. ఈ హెడ్‌సెట్స్ రూ.20,320 ధరకు వచ్చే వారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకస్తుంది. ఇవి యూసీ సర్టిఫైడ్ సౌండ్ ప్రమాణాలను కలిగి ఉంది. అందువల్ల దీని నుంచి వచ్చే సౌండ్ నాణ్యంగా ఉంటుంది. అలాగే ఈ హెడ్‌సెట్ ద్వారా 13 గంటల వరకు నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ వినవచ్చు. స్మార్ట్‌ఫోన్, పీసీ, ల్యాప్‌టాప్‌లకు ఈ హెడ్‌సెట్ కనెక్ట్ అవుతుంది.