మిషన్ భగీరథ పై సీఎం కేసీఆర్ సమీక్ష

SMTV Desk 2017-08-24 17:03:52  CM KCR, MISSION BHAGIRATHA PROJECT, CM CAMP IN PRAGATHI BHAVAN.

హైదరాబాద్, ఆగస్ట్ 24 : తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి౦చిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ కు దక్కింది. అయితే ఆయన హైదరాబాద్ ప్రగతి భవన్ లో మిషన్ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. "ఈ మిషన్ భగీరథ రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని, అంతే కాకుండా ప్రభుత్వానికే జీవన్మరణ సమస్యగా మారింది. ఈ పథక లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, గుత్తేదారులు రాత్రి పగలు కష్టపడి పని చేయాలని" సూచించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజలందరికి రక్షిత మంచి నీరు అందించడమే ధ్యేయంగా రూ.43 వేల కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసామని తెలిపారు. ఈ సంవత్సరం చివరి నాటికి అన్ని ప్రాంతాల్లో మంచి నీరు అందేలా వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు, ఇన్ టేక్ వెల్స్ వంటి నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.