ఏడు తలల పాము...గ్రామస్థుల పూజలు

SMTV Desk 2019-05-08 16:06:14  snake god, god snake, karnataka devotion, seven heads snake

సినిమాల్లో ఏడుతలల పామును చూసే ఉంటారు. నిజంగా ఎప్పుడైనా చూశారా..? అసలు నిజంగా ఏడు తలల పాము ఉందా..? ఉందనే అంటున్నారు కొందరు.. ఉంది అనడానికి సాక్ష్యంగా కర్ణాటక రాష్ట్రంలోని రామనగర ప్రాంతంలో పాము కుబుసం కనిపించింది. ఇంకేముంది. దేవతామూర్తి తమ ప్రాంతంలో పర్యటిస్తోందంటూ...ఆ పాము కుబుసానికి పూజలు చేయడం మొదలుపెట్టారు.

సాధారణంగా పాము తన కుబుసాన్ని వదిలపెడుతున్న సంగతి తెలిసిందే. కాగా గత మూడు రోజుల క్రితం కోడిహళ్లి గ్రామం సమీపంలో స్థానికులకు ఓ పాము కుబుసం కనిపించింది. దానికి ఏడు తలలు ఉన్నట్లుగా ఆ కుబుసం ఉంది. దీంతో సమాచారం అందుకున్న గ్రామస్తులు అదో మహత్యంగా భావించి పూజలు ప్రారంభించారు. సమీపంలోనే పాము పుట్ట కూడా ఉండడంతో జనం నమ్మకాలకు ఊతమిచ్చినట్టయింది.

విషయం కాస్త పక్క గ్రామాలకూ తెలిసి జనం తండోపతండాలుగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. 6 నెలల క్రితం దగ్గరలోని కోటెకొప్పఅనే గ్రామం నివాసి దొడ్డకెంపేగౌడ అనే వ్యక్తికి ఏడుపడగల పాము కనిపించినట్టు చెప్పుకున్నాడు. అప్పుడు దగ్గరలో పనిచేస్తున్న కొందరితో ఏడుపడగల పాము పోతోంది చూద్దురు రండి అంటూ పిలిచాడట.

అయితే అప్పుడు పాము కనిపించలేదట. ఇప్పుడు వారి నమ్మకాలను బలపరిచేలా ఏడుపడగలు గల పాము పొర కనిపించడంతో నాగదేవత నిజంగా తమ ప్రాంతంలో సంచరిస్తోందంటూ... పూజలు చేయడం ప్రారంభించారు.