కెసిఆర్ ని జైలుకు పంపిస్తాం : కాంగ్రెస్

SMTV Desk 2019-05-08 15:12:29  KCR, Congress,

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సిఎం కేసీఆర్‌, కుటుంబ సభ్యులా అవినీతిపై విచారణ జరిపించి జైలుకు పంపిస్తాము. రానున్న ఆరు నెలలలో తెరాస ప్రభుత్వం కూలిపోవడం ఖాయం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్‌ జెండాలు రెపరెపలాడటం తధ్యం. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకొంటున్న కేసీఆర్‌ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఖజానా ఖాళీ అయిపోయింది. గ్రామపంచాయతీలకు నిధులు విడుదల కాకపోవడంతో గ్రామీణ వ్యవస్థలు స్తంభించిపోతున్నాయి,” అని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల తరువాత తెరాస భరతం పడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ హెచ్చరిస్తుండగా, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ ప్రభుత్వం కూల్చివేస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరిస్తుండటం గమనిస్తే ఆ రెండు పార్టీలు తెరాసపై ఎంతగా రగిలిపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.