విశాఖలో 8 నూతన ఐటీ కంపెనీలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

SMTV Desk 2017-08-24 16:59:21  Minister Nara Lokesh, Vizag Cyber towers, It Companies, IT Hub, IDA Automation

విశాఖ, ఆగస్ట్ 24: నేడు విశాఖలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ నగరాన్ని ఐటీ హబ్ గా తీర్చిద్దితుంది. దానికి తగినట్లు అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఈ నేపధ్యంలో నేడు విశాఖలో 8 ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఏపెక్స్‌ కంటెంట్‌ సొల్యూషన్స్‌, ఐడీఏ ఆటోమేషన్‌, వర్చువల్‌ గార్డ్‌ సర్వీసెస్స్‌, జీవా డిజిటల్‌ సర్వీసెస్‌, విస్మయ ప్రీమీడియా, అవ్యా ఇన్‌వెట్రాక్స్‌, వెంటర్‌ ఆఫ్‌షోర్‌ ఇన్‌ఫర్మాటిక్స్‌, అమ్‌జూర్‌ ఇన్ఫోటెక్ కంపెనీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 770 మందికి ఉద్యోగవకాశాలు రాబోతున్నట్లు మంత్రి తెలిపారు. రిషికొండ వద్ద 11 అంతస్తుల భవనాన్ని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఏటీ ఏజెన్సీ(ఏపీటా) అద్దెకు తీసుకుని కంపెనీలకు కేటాయించిందని అధికారులు తెలిపారు.