భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల మధ్య సద్దుమనిగిన వివాదం

SMTV Desk 2019-05-08 14:26:13  bcci, Australia cricket

భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల మధ్య వివాదం కాస్త సద్దుమణిగింది. దీంతో అన్ని అనుకున్నట్టుగానే వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో ఆసీస్ వన్డే సిరీస్ ఆడబోతుంది. ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2019-2020లో ఆసీస్ ఆడే సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను సీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా విడుదల చేసింది. భారత్ సిరీస్‌ అనుకున్న సమయంలో న్యూజిలాండ్‌తో సిరీస్ జరిగితే తమకు లాభం చేకూరుతుందని.. స్వదేశంలో ప్రసారదారుల నుంచి వచ్చిన ఒ త్తిడి మేరకు భారత్ పర్యటనలో మార్పులు చేయాలని బీసీసీఐని సీఏ కోరింది. ఈ నేపథ్యంలో జనవరిలో ఆసీస్‌ టూర్‌పై పలు అనుమానాలు నెలకొన్నాయి. కానీ బీసీసీఐ వెనక్కు తగ్గకపోవడంతో.. యథావిధిగా ఆ పర్యటనకు తమ జట్టును పంపేందుకు సీఏ అంగీకరించింది.ఈ వివాదం కారణంగానే ప్రస్తుతం జైపూర్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఛాలెంజ్‌(మినీ ఐపీఎల్‌)లో ఆసీస్ మహిళా క్రీడాకారిణిలను క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆడనివ్వలేదు. దీంతో ఆసీస్ స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. మహిళల టీ20 ఛాలెంజ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌, సూపర్‌నోవాస్‌, వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, మిథాలీ రాజ్, స్మృతి మంధానాలు ఈ మూడు జట్లకు సారధ్య బాధ్యతలు వహిస్తున్నారు.