దక్షిణాఫ్రికాకు షాక్

SMTV Desk 2019-05-08 13:52:38  south africa, icc world cup 2019, Anrich Nortje

జొహానెస్‌బర్గ్‌: ఐసిసి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్ట్టు ఫాస్ట్‌ బౌలర్‌ అన్రిచ్‌ నోర్జె గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా 25 ఏళ్ల నోర్జె వేలికి గాయమైంది. అతడు కోలుకోవడానికి కనీసం రెండు నెలలు పడుతుందని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు తెలిపింది. నోర్జె స్థానంలో ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌కు దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కింది. ఈ ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మోరిస్‌.. 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.