ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్...2నిమిషాల్లోనే టిక్కెట్లు అన్నీమాయం

SMTV Desk 2019-05-08 13:28:38  ipl 2019 final match, hyderabad uppal stadium

ఐపీఎల్ 2019 సీజన్ ఫైనల్ మ్యాచ్ ను హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. మే12న జరగనున్న ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు టిక్కెట్లను మంగళవారం ఆన్‌లైన్‌లో ఉంచారు. అంతే 2నిమిషాల్లోనే టిక్కెట్లు అన్నీ అమ్ముడుపోయాయని సైట్ నిర్వహకులు వెల్లడించారు. ఈవెంట్స్ నౌ అనే ప్రైవేట్ కంపెనీ టిక్కెట్ల అమ్మకాల వ్యవహారం చూసుకుంటోంది. మంగళవారం.. మధ్యాహ్నం 2గంటల నుంచి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంచుతామని తెలిపింది. సమయం 2దాటి 2నిమిషాలు పూర్తవగానే టిక్కెట్లు అన్నీ అయిపోయాయంటూ సైట్‌లో పెట్టేశారు. గవర్నమెంట్ కౌన్సిల్ ఈ టిక్కెట్ల మానిఫెస్టోను తయారుచేసింది. ఇందులో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. టిక్కెట్ అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు కొంత వాటాతో ఇవ్వనుండగా, మిగిలిన మొత్తం లాభాలన్నీ బీసీసీఐకే చెందనున్నట్లు ప్రముఖ పత్రిక వెల్లడించింది.స్టేడియంలో మొత్తం 39వేల సీట్లు ఉంగా, ఈస్ట్, వెస్ట్, టెర్రస్‌లతో పాటు వీఐపీ సీటింగ్ కూడా అందుబాటులో ఉంది.