"అర్జున్ రెడ్డి" చిత్రంలో ఆ సన్నివేశాలు తొలగించాలి : వీహెచ్

SMTV Desk 2017-08-24 16:26:04  DIRECTER SANDEEP VANGAA, V. HANUMANTHA RAO, STRIKE, ARJUN REDDY MOVIE, RAM GOPAL VARMA, SENSOR BOARD

హైదరాబాద్, ఆగస్ట్ 24 : సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన "అర్జున్ రెడ్డి" సినిమా శుక్రవారం విడుదల కాను౦ది. అయితే ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమ౦తరావు ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిలో కొన్ని సన్నివేశాలు యువతను పెడదారి పట్టించేలా ఉన్నాయని వెంటనే వాటిని తొలగించాలని హైదరాబాదులోని సెన్సార్ బోర్డ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అంతేకాకుండా ఎంతో పవిత్ర౦గా భావించే వినాయక చవితి పండగ రోజున ఇలాంటి చెత్త సినిమాలు రిలీజ్ చేయడమేంటని ప్రశ్నించారు. లిప్ లాక్ చేస్తూ ఉన్న పోస్టర్లను బస్సులకు అంటించడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకుముందే ఈ విమర్శలకు చిత్ర హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించిన విషయం తెలిసిందే.