రూ. 35 కోట్ల డాలర్ల నిధులు సేకరించనున్న జీఎంఆర్‌

SMTV Desk 2019-05-08 13:22:49  gmr, delhi international airport

హైదరాబాద్‌: జీఎంఆర్‌ గ్రూప్‌కు సంబంధించిన ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ బాండ్ల జారీ ద్వారా 35 కోట్ల డాలర్ల (రూ. 2,450కోట్లు) నిధులు సేకరించాలని సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ క్రమంలో 10 ఏళ్ల సీనియర్‌ సెక్యూర్డ్‌ బాండ్లను జారీ చేయనుంది అని సమాచారం. అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీ స్‌.. ఈ ప్రతిపాదిత బాండ్లకు బీఏ2 రేటింగ్‌ను కేటాయించింది. డీఐఏఎల్‌ 2006లో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకుంది. ప్రస్తుతం ఈ విమానాశ్రయం డీఐఏఎల్‌ నిర్వహ ణలోనే ఉంది. బాండ్ల జారీ ద్వారా సేకరించిన నిధులతో విమానాశ్రయంలోని ప్రయాణికుల నిర్వ హణ వార్షిక సామర్థ్యాన్ని 10 కోట్ల స్థాయికి పెంచుకోవాలను కుంటోంది. ఈ మూడేళ్ల అభివృద్ధి ప్రణాళిక కోసం రూ.9,800 కోట్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయని కంపెనీ అంచనా వేస్తోందని మూడీస్‌ పేర్కొంది.