అతని కోసం అందరం పోరాటం చేయాలి: పమేలా ఆండర్సన్‌

SMTV Desk 2019-05-08 13:18:33  Julian Assange, Pamela Anderson,Pamela Anderson visits Julian Assange in prison

లండన్‌: జైల్లో ఉన్న వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేను తాజాగా శృంగార భామ పమేలా ఆండర్సన్‌ కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...అసాంజేను ఇక్కడ కలుసుకోవటం చాలా బాధాకరంగా ఉందని, ఆయన చాలా మంచి వ్యక్తిఅని, ఆయనంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. ప్రస్తుతం ఆయన జీవితం ప్రమాదంలో ఉందని, అసాంజేను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అతని క్షేమం కోసం అందరం పోరాటం చేయాల్సి ఉందని ఆమె అన్నారు.