మహర్షి : స్పెషల్ స్క్రీన్స్

SMTV Desk 2019-05-08 12:33:37  Maharshi,

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన మూవీ మహర్షి రిలీజ్ కు రెడీ కాబోతుంది. అత్యంత భారీ అంచనాల మధ్య మహర్షి చిత్రం 9వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో మొదటి రోజే సినిమా చూడాలని అభిమానులు ఉత్సాహం చూపుతన్నారు. ఇప్పటికే మొదటి రోజు టికెట్లన్నీ బుక్ అయిపోవడంతో అభిమానులు డీలా పడిపోతున్నారు.

అసలు ఎన్నికల పోలింగ్ హడావుడి ముగిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కౌటింగ్ కు ఉపశమనంగా మహర్షి సినిమా రాబోతుంది. మరో రెండు వారాల పాటు అభిమానులకు తెలుగు ప్రేక్షకులకు కాస్త ఎంటర్టైన్మెంట్ అన్నట్లుగా మహేష్ బాబు మూవీ విడుదల కావడం యాదృశ్చికమే అని చెప్పాలి. ఇప్పటికే అన్ని థియేటర్స్ లో సినిమా టికెట్స్ బుక్ అయిపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణలో అదనపు షోల కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 9వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఉదయం 8 నుండి 11 మధ్యలో షో వేయడానికి అనుమతులిచ్చింది. దీంతో అభిమానులు మహర్షి మూవీ రిలీజ్ కు ముందే పండుగ చేసుకుంటున్నారు. అంటే రోజుకు ఐదు షోలు ప్రదర్శించనున్నారన్నమాట. సినిమాపై క్రేజ్ చూస్తుంటే కలెక్షన్ల పరంగా సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.