బాహుబలిని తలపిస్తున్న అర్జున్ రెడ్డి

SMTV Desk 2017-08-24 16:11:36  Arjun Reddy, Vijay devarakonda, Premier show, Released date

హైదరాబాద్, ఆగస్ట్ 24: ప్రస్తుతం యువకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న చిత్రం "అర్జున్ రెడ్డి". పెళ్ళిచూపులు సినిమాతో హీరోగా అలరించిన విజయ్ దేవరకొండ, ఈ చిత్రంలో కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇటివల విడుదల అయిన టీజర్, పోస్టర్స్, ట్రయిలర్స్‌కి ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. అలాగే ఈ సినిమా రేపు వినాయకచవితి కానుకగా విడుదలకు సిద్ధమయింది. బాహుబలి తరువాత తెలుగులో మొదటిసారిగా ఈ చిత్రం ప్రిమియర్ షో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ షో కు సంబందించిన మొత్తం టికెట్స్ హాట్ కేకుల్లా విక్రయమవడం విశేషం. సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఇంతగా క్రేజ్‍ని సంపాదించుకున్న ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.