రెండవ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

SMTV Desk 2017-08-24 16:01:31  India, Srilanka, ODI series, second Odi, Pallekele odi

పల్లెకెలా, ఆగస్ట్ 24: భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్‍లో భాగంగా నేడు పల్లెకెలా స్టేడియంలో రెండవ వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ప్రతీకారం తీర్చుకోనే ఆలోచలో ఉన్న లంకేయులు ఈ మ్యాచ్‌లో జట్టులో మార్పులు చేశారు. తిషారా, వానిడు, సందకన్‌ల స్థానంలో దుష్మంతా, అకిలా ధనంజయ, మిలింద సిరివర్దనలు జట్టులోకి వచ్చారు. కాగా, నేటి మ్యాచ్ శ్రీలంకకు 800వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. మరోవైపు భారత్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే పోరులోకి దిగింది. లంకేయులు ఈ మ్యాచ్ కూడా ఓటమి పాలవుతారా లేదా ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటారా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.