తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు

SMTV Desk 2019-05-08 12:19:15  Gold Rate, Silver rate, Bullion market

న్యూఢిల్లీ: మంగళవారం నాడు అక్షయ తృతీయ సందర్భంగా దేశీ మార్కెట్లో పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ పర్వదినాన బంగారం కొంటే శుభం కలుగుతుందనే నమ్మకంతో కొనుగోలుదారులు వెల్లువెత్తడంతో నగల దుకాణాలు కిటకిటలాడాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గి రూ.33,720 నుంచి రూ.32670కి చేరింది. మరోవైపు వెండి కూడా బంగారాన్నే అనుసరించింది. కిలో వెండి ధర రూ.10 తగ్గి.. రూ.38,130 నుంచి రూ.38,120కి చేరింది. న్యూయార్క్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1282.2 డాలర్లు ఉండగా.. ఔన్స్ వెండి ధర 14.92 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు తగ్గడంతో ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32670 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.32500 వద్ద కొనసాగుతోంది. సార్వత్రిక పసిడి పథకంలో 8 గ్రాములు బంగారం ధర రూ.26,400 వద్దే స్థిరంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,920 వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,220 వద్ద కొనసాగుతున్నాయి. విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి. కిలో వెండి ధర రూ.39,600గా ఉంది.మార్కెట్లో కిలో వెండి ధర రూ.38,120 వద్ద కొనసాగుతోంది. ఇక వారంతపు ఆధారిత డెలీవరి వెండి ధర కిలోపై రూ.44 పెరిగి రూ.37,334 వద్ద కొనసాగుతోంది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.79,000 వద్ద, అమ్మకం ధర రూ.80,000 వద్ద ఉన్నాయి.