సహజీవనం చేయడమంటే పెళ్లి చేసుకున్నట్టె: రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు

SMTV Desk 2019-05-08 12:10:42  live in relationship, live in together, rajasthan high court

ఓ మహిళతో కొన్నాళ్లపాటు సహజీవనం చేసి, ఆ తర్వాత మరో యువతిని పెళ్లాడేందుకు ప్రయత్నించిన వ్యక్తికి రాజస్థాన్ హైకోర్టు షాకిచ్చే తీర్పు చెప్పింది. భారతీయ సమాజంలో సహజీవనం చేయడమంటే పెళ్లి చేసుకున్నట్టుగానే పరిగణించాలని అభిప్రాయపడింది. అంతే తప్ప మరోలా భావించడంలో అర్థం లేదని పేర్కొంది.

ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న వివాహితతో అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బలరాంకు స్నేహం కుదిరింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది. ఆమెను పెళ్లాడతానని బలరాం మాటివ్వడంతో ఉపాధ్యాయురాలు తన భర్త నుంచి వేరుపడి అతడి వద్దకు వచ్చేసింది. అయితే, ఇటీవల బలరాంకు ఐటీలో మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో అతడు మరో అమ్మాయిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన ఉపాధ్యాయురాలు హైకోర్టును ఆశ్రయించింది. సహజీవనం చేయడమంటే పెళ్లాడినట్టేనని సంచలన తీర్పు వెలువరించింది.