టికెట్ల ధరలు పెంచడంపై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం

SMTV Desk 2019-05-08 12:04:39  maharshi, mahesh babu, vamshi paidipally, pooja hegde

మహేష్ బాబు నుండి కొత్త సినిమా వస్తుందంటే అభిమానులంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తారు. మొదటి రోజే మహేష్ సినిమా చూడాలని తహతహలాడుతుంటారు. కానీ మహర్షి విషయంలో థియేటర్స్ యాజమాన్య నిర్ణయం అందర్నీ అగ్రనికి గురి చేస్తుంది. మహేష్ 25 వ చిత్రంగా తెరకెక్కిన మహర్షి చిత్రంపై అభిమానులు భారీ ఆశలు , అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్లే సినిమా ఉందని చిత్ర యూనిట్ పదే పదే చెపుతుంటడం తో ఎలాగైనా ఫస్ట్ డే చూసేయాలని ఫిక్స్ అయ్యారు. తీరా ఇప్పుడు చూస్తే టికెట్స్ రేటు అమాంతం పెంచడం అందర్నీ ఆగ్రహానికి గురించి చేస్తుంది.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80గా ఉన్న టికెట్ ధరను రూ.110కి పెంచారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్ మీద రూ.50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక ప్రసాద్ ఐమ్యాక్స్ అయితే రూ.138గా టికెట్ రేటును ఏకంగా రూ.200 చేసేసింది. ప్రభుత్వ అనుమతులు తీసుకునే టికెట్ ధరలు పెంచామని, రెండు వారాల పాటు ఇవే ధరలు ఉంటాయని యాజమాన్యాలు చెప్పడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రేంజ్ లో టికెట్స్ పెంచితే ఫ్యామిలీ అంత ఎలా చూడాలని వాపోతున్నారు. సరే రెండు రోజులైతే ఒకే కానీ మరి రెండు వారాల పాటు ఇదే రేటు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో నిర్మాతలు కలగచేసుకొని టికెట్స్ రేటు తగ్గించాలని కోరుకుంటున్నారు.