సినిమా విడుదలై నేటికి పదిహేనేళ్లు పూర్తవుతోందంటే నమ్మలేకపోతున్నాను: బన్నీ

SMTV Desk 2019-05-08 12:03:41  arya, allu arjun, bunny, sukumar, dsp

వన్ సైడ్ లవ్ కాన్సెప్టుతో వచ్చిన ‘ఆర్య’ అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాతో హీరోగా బన్నీ, దర్శకుడుగా సుకుమార్ నిలదొక్కుకొన్నారు. యూత్ లో బన్నీకి ఫాలోయింగ్ తీసుకొచ్చిన సినిమా. ఆర్యకు నేటితో పదిహేనేళ్లు నిండాయి.

ఈ సందర్భంగా బన్నీ స్పందించారు. “ఇప్పటికీ నేను అంతే ప్రేమను ఫీలవుతున్నాను. నా జీవితంలో ‘ఆర్య’ మ్యాజికల్‌ మూవీ. ఇది నా జీవితాన్ని మార్చేసింది. సినిమా విడుదలై నేటికి పదిహేనేళ్లు పూర్తవుతోందంటే నమ్మలేకపోతున్నాను. ధన్యవాదాలు సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌, రత్నవేలు, దిల్‌రాజు. అన్నింటికి మించి నన్ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు” అంటూ ఇన్ స్ట్రోగ్రామ్ లో రాసుకొచ్చారు.